సీపీఎం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఔట్..

cpm-12.jpg

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల నుంచి సీపీఎం తప్పుకుంది. ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని వెల్లడించింది. విశాఖ జిల్లాలో సీపీఎం పార్టీకి ఒక కార్పొరేటర్, ఒక జడ్పీటీసీ, నలుగురు ఎంపీటీసీల బలం ఉంది. కానీ గెలుపొందేందుకు కావాల్సినంత సంఖ్యాబలం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నికల్లో వైసీపీ, కూటమి మధ్యే ప్రధానంగా పోటీ ఉందని తేలిపోయింది.

విశాఖ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్య పరంగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 మంది ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 425గా ఉంది. అయితే 500 మంది ప్రజా ప్రతినిధులు ఎవరికి ఓటు వేస్తే వారి విజయం చాలా ఈజీ అవుతుంది. అయితే కూటమికి సైతం తగినంత బలం లేదు. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స పోటీలో ఉండగా కూటమి నుంచి ఎవరూ ఖరారు కాలేదు. ఇద్దరు కీలక నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తోంది.

Share this post

scroll to top