యాంకర్ సుమ కనకాల ఇంట్లో విషాదం..

యాంకర్ సుమ ఇంట్లో విషాదం..

ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ కనకాల సోదరి, సుమ ఆడపడుచు శ్రీలక్ష్మీ కనకాల ఇవాళ మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు ఈమె భర్త.

గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్‌ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా రాజీవ్‌ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.