ఏప్రిల్‌ నుంచే పెంపుదల అమల్లోకి జూలై 1న చేతికి రూ.7 వేలు పెన్షన్‌

penshion-18.jpg

సామాజిక పెన్షన్‌దారులకు తీపికబురు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచుతామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పెన్షన్‌ పెంపు ఫైలుపై సంతకం చేశారు. దీంతో ఇక నుంచి ప్రతి నెలా అదనంగా రూ.1000తో కలిపి మొత్తం రూ.4 వేలు ఎన్టీఆర్‌ భరోసా పేరిట పెన్షన్‌ అందనుంది. పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ లెక్కన ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలకు బకాయి రూ.3 వేలతో పాటు జూలై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్‌ రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలును జూలై 1న ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందనున్నారు.

Share this post

scroll to top