ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర..

pavan-kalyan-06.jpg

ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కన్నెర్ర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. చిన్న చేపలను వేటాడడం కాదు…పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసెయ్యాలన్నారు. దుంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్‌ శాండల్‌ దందా వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలన్నారు. రెడ్ శాండల్‌ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క…ఇక నుంచి మరో లెక్క అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. దుంగల్‌ – దొంగల్‌ బ్యాచ్‌ భరతం పడతామంటున్నారు పవన్‌. ఇన్నాళ్లు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు…ఇక బడా స్మగ్లర్ల అంతు చూడాలని అటవీశాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం.

Share this post

scroll to top