సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మాజీ ఎమ్మెల్యేకు వాట్సప్ కాల్ చేసిన మహిళ.. కట్ చేస్తే, రూ.50లక్షలు..

whats-09.jpg

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసానికి కాదేది అనర్హం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వేలు.. రూ. లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. మ‌నిషి ఆశ‌ను, భయాన్ని ఆసరాగా చేసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మోసగాళ్ల బారిన పడి లక్షలు పోగొట్టుకున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు (85) మోసగాళ్ల చేతిలో చిక్కి రూ. 50 లక్షలు పోగొట్టుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.. గత శనివారం ఆయనకు వాట్సప్ ఫోన్ చేసిన ఓ మహిళ మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ జయదేవనాయుడికి చెప్పింది.

Share this post

scroll to top