జగన్ సర్కార్ కీలక నిర్ణయం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త 108 వాహనాల్లో వెంటిలేటర్లు

కరోనా కట్టడికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాల్లో.. 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైప్‌ సపోర్ట్‌) వాహనాలుగా మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేయనున్నాయి. రెస్‌మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమరుస్తారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌, పల్సాక్సీ మీటర్‌ వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. త్వరలోనే వీటిని వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలకు రూ.3.84 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్‌ గమ్‌ షూ, యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్‌ పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్క రక్షణ కిట్‌ కోసం గరిష్టంగా రూ. 3 వేల చొప్పున ఖర్చు చేయనున్నారు.