ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) – 2024 ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 2,35,907 మంది హాజరుకాగా.. వారిలో 1,37,903 మంది అంటే 58.04 శాతం మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల కోసం నిర్వహించిన పేపర్-1 పరీక్షను 1,13,296 మంది రాయగా, 75,142 (66.32 శాతం) మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కు 1,19,500 మంది హాజరుకాగా, 60,846 (50.92 శాతం) మంది అర్హత సాధించారు. ఏపీ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారందరికీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి సన్నద్ధం కావాలని లోకేశ్ పిలుపు నిచ్చారు. టెట్‌లో అర్హత సాధించని వారు నిరవాశకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. వారితోపాటు కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తొలుత టెట్ పరీక్ష నిర్వహించి, అనంతరం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
- Home
- News
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే.