అధికారులపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్.. సీఎస్‌కు కీలక ఆదేశం..

pspk.jpg

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పాలనలో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్న వెంటనే తన శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలడంపై అధికారులను ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయంటూ పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలిట్లు సమాచారం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్‌ను ఎవరి ఆదేశాల మేరకు ఎంతమేర మళ్లించారో పూర్తి నివేదిక కావాలని పవన్ సీఎస్‌ను ఆదేశించారు.

Share this post

scroll to top