కరోనా నివారణ చర్యలపై ఏపీ కేబినెట్‌ సమావేశం

కరోనా నివారణపై మంత్రివర్గ సమావేశం మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్‌ 6వ ఫ్లోర్‌లో గురువారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రూప్‌ అఫ్‌ మినిస్టర్స్‌ కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన సమావేశం జరిగింది. కరోనా నియంత్రణ, బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ బెడ్స్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్స్‌పై కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు పలు అంశాలపై మంత్రుల కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి రోగులకు వైద్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్‌, వైద్య సిబ్బంది, అధికారులు, శానిటేషన్‌ సిబ్బంది, ఆశా వర్కర్స్‌, వాలంటీర్స్‌ అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కమిటీ అభినందనలు తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. అలాగే ప్రతి హాస్పిటల్‌ లో 50% ఆరోగ్య శ్రీ పెషేంట్స్‌కు బెడ్స్‌ ఇవ్వాలని సూచించింది. ప్రయివేటు హాస్పిటల్స్‌ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.