ఏపీలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉందని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడించారు.
అందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామని అన్నారు. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘటలపై విచారణ ప్రారంభించామని చెప్పిన ఆయన.. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు.