పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే.. చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుంది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నారు. నెలలో ఓ పది రోజులు ఇక్కడే ఉండి.. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణులు పరిశీలించనున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలి.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించారు.. మీడియాను కూడా భయపెట్టే పరిపాలన గత 5ఏళ్లలో జరిగింది.. న్యాయస్థానాలను సైతం బ్లాక్‌మెయిల్ చేసేలా న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించారు.. రాష్ట్ర పుననిర్మాణo జరగాల్సిన పరిస్థితి నెలకొంది.. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించాం.. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ప్రజలు గెలిచారు, ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని నిలబెడతాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఇందులో భాగంగా బడ్జెట్ కంటే ముందే తొలుత ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం.. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపం లా మారాడు.. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది.. అలాంటి ప్రాజెక్టు జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.. 1941 నుంచి తెలుగు ప్రజల కలగా పోలవరం ఉంది.. 90 మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేసాం అని స్పష్టం చేశారు. పోలవరం అంత భారీ ప్రాజెక్టు దేశంలో ఇక ఉండదేమో? అన్నారు.. 2014లో తెలంగాణలో ఏడు ముంపు మండలాలు.. నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విలీనం జరిగేలా కృషి చేశా అని గుర్తుచేసుకున్నారు.. 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తిoచి 72 శాతం పూర్తి చేశాం అన్నారు.. కానీ, జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ. 990 కోట్లు అవసరమవుతాయి. రిపేర్లు చేసినా ఎంత వరకు ఆగుతుందో చెప్పడం లేదన్నారు.. సీపేజ్ ఎప్పటిలోగా అరికట్టగలరో చెప్పలేకపోతున్నారు. కాఫర్ డ్యాం ఫౌండేషన్ కూడా దెబ్బతింటోందన్నారు చంద్రబాబు. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉండాలి.. కానీ, పోలవరం 41 మీటర్ల మేర ఎత్తుకు తగ్గించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ హయాంలో రూ.4187 కోట్లు ఖర్చు పెట్టాం. పోలవరం నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 3 వేలకు పైగా మళ్లించారని విమర్శించారు. పునరావాసంలో భాగంగా టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
- Home
- News
- Andhra Pradesh
- పోలవరంను దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులు.. నెలలో 10 రోజులు అక్కడే మకాం..!