రాజకీయ నేతలంటే ప్రజలను పాలించే నాయకులు నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను తీర్చే ప్రజా సేవకులుఅని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. నేడు ఆయన సెక్రటేరియట్ నుంచి వెళ్తున్న సమయంలో.. అక్కడ ఉన్న సందర్శకులను చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ను నడిరోడ్డుపై ఆపి ప్రజలతో మాట్లాడారు. అలానే వాళ్లు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పంధిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు ఎంత తేడా ఉంది, ఒక్కసారి సీఎం పదవి వరించగానే ప్రజలకు దూరంగా.. పరదాల చాటున తిరిగిన వ్యక్తి జగన్ అయితే , ఇప్పటికి నాలుగు సార్లు సీఎం అయినా, చంద్రబాబు మాత్రం ప్రజల్లో ప్రజలుగా కలిసిపోతూ నడిరోడ్డుపై తన కాన్వాయ్‌ను ఆపి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. తాను ప్రజా నాయకుడిని కాదని ప్రజా సేవకుడినని నిరూపించిన వ్యక్తిత్వం ఉన్న అసలైన నేత చంద్రబాబు అని సీఎంపై నెటిజన్స్ ప్రశంల జల్లు కురిపిస్తున్నారు. అలానే ఇకపై పరదాలు లేవు.. బారికేడ్లు ఉండవు.. ప్రజలు వెళ్లి సీఎంని కలవటానికి ఏ అడ్డూ ఉండదు అని నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.