కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్.. కమిషనర్‌పై వేటు

కరోనా నివారణ, లాక్‌డౌన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది చాలా దారుణమని.. కరోనా ఎవరికైనా సోకొచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని.. వారిపై సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం మంచిది కాదన్నారు.

ఇలాంటి ఘటనలతో తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు జగన్. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చని.. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సూచించారు. ఇదిలా ఉంటే కర్నూలు కమిషనర్‌ రవీంద్రబాబుపైనా బదిలీ వేటు పడింది. నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి బాలాజీని నియమించారు.