ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయింది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్సార్ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు. కడపలో బై ఎలక్షన్ వస్తుందని ఎల్లోమీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని పట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కూర్చుని ఉంటారని అనడం విడ్డూరం. మహబూబ్ నగర్ గెలిపించుకోలేని రేవంత్.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజననష్టం. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు