ఈ రోజు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్లిన పవన్. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్ కల్యాణ్ భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం అయిన నాకే పోర్టు అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సిందే అన్నారు. అసలు నేను పర్యటనకు వస్తే ఎస్పీ ఎందుకు కనిపించడం లేదు ? అని ప్రశ్నించారు పవన్. నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు ఎందుకు తీసుకున్నాడు. ఇదంతా చాలా బాగుంది అంటూ ఎద్దేవా చేశారు. పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్ అధికారులు చాలా నామ మాత్రంగా యాక్షన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.