ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు డీఎస్సీ కోచింగ్‌ను ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటన వెలువరించారు. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్‌ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.