జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు

ఏపీలో వృద్ధాప్య పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా రూ.2225 పెన్షన్‌ గా ఇస్తున్నారు. దీనిని రూ.2500కు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా సీఎం జగన్‌ వెల్లడించారు. అలాగే రానున్న 45రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో రూ.45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. త్వరలో తేదీ ప్రకటించనున్నారు.