వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..

office-04.jpg

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చట్ట నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు.. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది.

Share this post

scroll to top