రెడ్ బుక్’పై తొలిసారి స్పందించిన ఏపీ హోం మంత్రి అనిత.. 

anitha-27.jpg

రెడ్ బుక్‎పై స్పందించారు ఏపీ హోం మంత్రి అనిత. రెడ్ బుక్ అనేది కక్షసాధింపు కాదని గత ప్రభుత్వంలో సరిగా పనిచేయని అధికారుల పేర్లు అందులో ఉంటాయన్నారు. తాము ఎక్కడా కక్షసాధింపు చర్యలకు దిగడం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడి మాటకు విలువిచ్చి సంయమనంగా ఉన్నామన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. అందుకే కూటమికి 175 స్థానాలకుగానూ 164 స్థానాల్లో గెలిపించారన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ముందుగా  పోలీసు వ్యవస్థ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని తెలిపారు. కానీ గత ఐదేళ్లుగా వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు మంత్రి వంగలపూడి అనిత. కనీసం చెక్‌పోస్ట్‌ల దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. అలాగే తమ ప్రభుత్వం ప్రధాన ఎజెండా గంజా నిర్మూలన, మహిళా భద్రత, పోలీసులకు సౌకర్యాలు, పోలీసుశాఖలో దరఖాస్తుల భర్తీ అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు స్టేషన్ల కనీస అవసరాలకు రూ. 8వేలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఒక్కో పోలీసు స్టేషన్ కనీస అవసరాల నిమిత్తం నెలసరి ఖర్చుకు రూ. 75వేలు ఇస్తున్నారని చెప్పారు.

Share this post

scroll to top