ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.
