రెండు జిల్లాలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుల నియామకం..

ys-jagan-28.jpg

వైయ‌స్ఆర్‌సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్‌ నియమితులయ్యారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.  

Share this post

scroll to top