ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల వచ్చే లాభాల్లో చర్మ ఆరోగ్యం కూడా ఒకటి. మార్నింగ్ వాక్ వల్ల చర్మం ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గి, యంగ్‌గా ఉంటుంది. ముఖంలో మంచి గ్లో వస్తుంది.
ఉదయం నడక వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్లల్లో వశ్యత పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఉదయం పూట వాకింగ్ చేయడం చాలా మంచిది. మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గుతుంది. అదే విధంగా శరీరంలో మెటబాలిజం రేటు తగ్గుతుంది. కాబట్టి ఈజీగా మీరు వెయిట్ లాస్ అవ్వొచ్చు.