సాధారణంగా మన ఇంట్లో పూరీ, బజ్జీలు వేయించిన తర్వాత కొంత నూనె మిగిలి ఉంటుంది. చాలా మంది ఈ నూనెను ఇతర ఆహారాలకు కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడొద్దని హెచ్చరికను సిఫార్సు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచే విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయని పరిశోధకలు తెలిపారు.
వంట నూనెను వేడి చేయడం వల్ల విషపదార్థాలు విడుదలవుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను కూడా పెంచుతుంది. అలాగే వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ICMR, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో, ఆహార ఎంపికలు చేయడంలో సహాయపడటానికి 17 కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.