ఏపీ ప్రజలకు అలర్ట్…ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు దిగి వచ్చాయి. సిఎస్ జవహర్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో స్కీమ్ సేవల్ని యధాతధంగా కొనసాగించనున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
మరో రూ. 300 కోట్ల నిధుల విడుదలకు సిఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ. 1500 కోట్ల బకాయి పడింది. ఇటీవల రూ. 203 కోట్లు విడుదల చేసింది.