జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచేది లేదని… ఈసారి జైలుకు వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఆయన రెండో తేదీన కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… తాను ఎల్లుండి లొంగిపోనున్నట్లు చెప్పారు. జూన్ 2న తాను లొంగిపోయిన తర్వాత ఈసారి మరెంతకాలం జైల్లో ఉంటానో తెలియదన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ప్రజల గురించే ఆలోచిస్తానని పేర్కొన్నారు.