టీటీడీ బోర్డ్ చైర్మన్ గా టీవీ 5 ఛానెల్ చైర్మన్ బీర్ ఆర్ నాయుడును ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. తిరుపతికి చెందిన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్రక్షాళన చేస్తామన్నారు. తిరుమలలో పని చేసే వారు కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం వక్ఫ్ బోర్డ్ తో పాటు వక్ఫ్ కౌన్సిల్ లో నాన్ ముస్లిమ్ లకు చోటు కల్పిస్తూ బిల్లు రెడీ చేసిన సంగతి తెలిసిందే.
మన దేశంలో హిందూ దేవాలయాలకు ఒక న్యాయం. ముస్లిమ్స్ కు మరో న్యాయమా అని మండిపడ్డారు. గతంలో ఒవైసీ తిరుమల లడ్డూ కల్తీపై తనదైన శైలిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపి హిందూ మనోభావాలను దెబ్బ తీయడాన్ని తప్పు పట్టి సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాజాగా తిరుమల బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను వక్ఫ్ బోర్డ్ కు ముడిపెడుతున్నారు.