చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు

sarath-kum-ar.jpg

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. తన స్నేహితుడైప హోమియోపతి డాక్టర్ ను బుధవారం స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్.

దీనికి సంబంధించిన దృశ్యాలు…. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ అయింది. జిల్లా అధికారులు డీజీపీకి నివేదిక పంపడంతో డిఎస్పీ పై పడింది వేటు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ సందర్భంగా కూచువారిపల్లె, రామిరెడ్డి పల్లిలో అల్లర్లు అదుపు చేయడంలోనూ విఫలం అయ్యారు చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడితే అవకాశం ఉంది. ఇప్పటికి అయితే…చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు ప డింది.

Share this post

scroll to top