Author Archives: News

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో కోస్తా జిల్లాలకు తుఫాను గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గల్ఫ్‌ ఆఫ్‌ థారులాండ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించిందని.. మరోవైపు రాయలసీమను ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో ఉత్తర అండమాన్‌ సముంద్రం, దాని పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని.. ...

Read More »

ఎపి పాలీసెట్‌ – 2020 పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పాలీసెట్‌ – 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం వెలువడ్డాయి. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ లో ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ లు ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది విద్యార్థులు హాజరుకాగా, 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు. మట్టా దుర్గాసాయి కీర్తి తేజ (పశ్చిమ గోదావరి) మొదటి ర్యాంకు, సుంకర అక్షరు ప్రణీత్‌ (తూర్పు గోదావరి) ...

Read More »

రఘురామ కృష్ణంరాజు సంస్థలో సిబిఐ సోదాలు

నరసాపురం వైసిపి ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సిబిఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ లోన్‌ బకాయిలపై కేసు నమోదు చేసిన సిబిఐ గురువారం రఘురామ కృష్ణంరాజు నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఈనెల 6 న హైదరాబాద్‌, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 11 చోట్ల సోదాలు చేపట్టారు. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సిబిఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ...

Read More »

రూ.8 కోట్ల నష్టాన్ని హీరో విశాలే భరించాలి : హైకోర్టు

యాక్షన్‌’ చిత్రం వల్ల నష్టపోయిన నిర్మాతలకు హీరో విశాల్‌ డబ్బులు చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. విశాల్‌, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రం తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈచిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకోవడంతో నష్టాలు చవిచూసింది. అప్పటికే ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించినప్పటికీ ఎక్కువ బడ్జెట్‌ కేటాయించాలని విశాల్‌ సూచించారు. ఆ సమయంలో సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే మిగిలిన నష్టాన్ని తాను భరిస్తానని ...

Read More »

అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు : ఎన్‌టిఆర్

సైబర్‌ మోసాల్లో చిక్కుకోకుండా ప్రతీ యువతీ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించిన సినీ హీరో ఎన్‌టిఆర్‌ నెటిజన్లతో భేష్‌.. అనిపించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ మోసాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా యువతులు ఈ మోసాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ ఓ వైపు పరుగులు తీస్తుంటే.. మరోవైపు సైబర్‌ నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నో రకాల ఆన్‌లైన్‌ మోసాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్‌లు చేస్తూ.. వారికి దగ్గరై వారి వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను సేకరించి, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ...

Read More »

రానున్న మూడు రోజుల్లో ఎపిలో భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల్లో ఎపిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ...

Read More »

జగనన్న విద్యాకానుక ప్రారంభం

జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో పునాదిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక ప్రారంభించడానికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలకు చేరుకున్న  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, గుమ్మనూర్ జయరాం, శంకర నారాయణ తదితరులు స్వాగతం పలికారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించిన ...

Read More »

దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి  రోజు రోజుకు పెరుగుతోంది. గత కొద్దిరోజులు వారి సంఖ్య తగ్గినట్లు కనిపించినా, మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది.  పాజిటివ్‌ కేసుల సంఖ్య 68లక్షలు మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో 78,524 కొత్త పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబం, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 971 మంది మరణించారు.  ప్రస్తుతం దేశంలో 9,02,425 క్రియాశీల కేసులు ఉండగా, 58,27,705 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ...

Read More »

అతడితో కాజల్‌ బంధం ఇప్పటిది కాదు!

కాజల్‌ గతంలో పార్టీల్లో పాల్గన్న ఫొటోలపై ఓసారి లుక్కేస్తే చాలా ఫొటోల్లో కాజల్‌తో గౌతమ్‌ ఉన్నాడు. అతడితో ఆమె చాలా క్లోజ్‌గా కూడా కనిపిస్తోంది. దీన్ని బట్టి కాజల్‌ది ప్రేమ పెళ్లి అని అర్థమవుతోంది. ముందు గౌతమ్‌తో పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లుంది. గౌతమ్‌తో ఉన్న ఫొటోల్లో కాజల్‌ లుక్‌ చూస్తే ఏడెనిమిదేళ్ల కిందటి ఆమె సినిమాల లుక్స్‌ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి వీళ్లది సుదీర్ఘ బంధమే అన్నమాట. ఇక కాజల్‌కు కాబోయే వరుడు అని తెలియగానే గౌతమ్‌ గురించి ...

Read More »

‘పుష్ప’ ఇంకాస్త ఆలస్యం చేస్తాడట!

‘అలా వైకుంఠపురం’తో హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌… ఆ సినిమా తర్వాత వెంటనే ‘పుష్ప’ సినిమా చేయాలని భావించినప్పటికీ… కరోనా కారణంగా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ‘పుష్ప’ చిత్ర బృందం కూడా షూటింగ్‌కి సిద్ధమైంది. అడవి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలని మొదట భావించారు. అయితే, ఏకంగా అడవి సెట్‌ వేయబోతున్నట్లుగా కూడా వార్తలచ్చాయి. చివరకు కేరళ అడవుల్లోనే ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభించనున్నారని, ఇంకే కారణం చేతనూ షూటింగ్‌ ఆగదని యూనిట్‌ సభ్యులు తెలిపారు. ...

Read More »