Author Archives: News

ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌

తెలంగాణ సిఎం కెసిఆర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలు చేయనున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Read More »

చల్లా కుటుంబాన్ని పరామర్శించిన జగన్

కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మండలి విప్ గంగుల ప్రభాకర్ ...

Read More »

శూర్పణఖగా రెజీనా

 రెజీనా విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తన కెరీర్‌ పరంగా బ్రేక్‌నిచ్చి సినిమా ”పిల్లా నువ్వులేని జీవితం’ అయితే, అడవిశేష్‌తో నటించిన ‘ఎవరు’ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రను పోషించి అందరి ప్రశంసల్ని పొందారు. ఆమె తాజాగా ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ‘నేనేనా’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళంలో ‘శూర్పణగై’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హర్రర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా ‘శూర్పణఖ’గా నటిస్తోంది. ఇందులో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా ...

Read More »

టిడిపి నేత భూమా అఖిలప్రియ అరెస్ట్‌… పరారీలో భర్త

మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ కొద్దిసేపటి క్రితం అరెస్టయ్యారు. హఫీజ్‌ పేటలో వెలుగులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియను నార్త్‌ జోన్‌ మహిళా ఇన్‌ స్పెక్టర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌ పల్లిలోని లోథా అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో ఉన్న ఆమెను ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన్ను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్‌ చేస్తామని ...

Read More »

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు నిర్వహించారు.. అనంతరం జస్టిస్‌ గోస్వామి హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేసుల విచారణ చేశారు.

Read More »

రామతీర్థం ఘటన పై సిఐడి విచారణ ప్రారంభం

ఎపి రాజకీయాలను వేడెక్కిస్తున్న రామతీర్థం ఘటన పై సిఐడి విచారణను ప్రారంభించింది. సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సిఐడి సేకరిస్తుంది. రామతీర్థంలో నేడు ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం చలో రామతీర్థ ధర్మ యాత్రకు బిజెపి-జనసేన లు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో.. పోలీసులు ఆంక్షలను విధించారు. నెల్లిమర్ల లోని రామతీర్థాల జంక్షన్‌ ను పోలీసు అధికారులు మూసేశారు. మీడియాను సైతం రామతీర్థాలకు వెళ్లనీయకుండా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు.

Read More »

పూజాహెగ్డేపై ప్రతీకారం తీర్చుకున్న సమంత

సమంత, పూజాహెగ్డేల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. ఎందుకంటే మొదటగా.. పూజాహెగ్డే మజిలి పోస్టర్‌ను పోస్ట్‌ చేసి ఈమె అందంగా ఉంందా? అని సమంతను ప్రశ్నించినట్లుగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఈ పోస్ట్‌పై పూజాహెగ్డే స్పందిస్తూ.. ఈ పోస్ట్‌ తను చేయలేదని..తన ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపింది. ఈ చర్యపై తాను క్షమాపణలు కూడా చెప్పింది. ఏదిఏమైనా పూజా చేసిన పోస్ట్‌పై అటు సమంత అభిమానులు కానీ, ఇటు పూజాహెగ్డే ఫ్యాన్స్‌ కానీ కొంత హార్ట్‌ అయ్యారనే చెప్పుకోవచ్చు. ...

Read More »

రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో రెండు మూడు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల్లో తక్కువ ఎత్తులో తూర్పు, ఈశాన్యగాలులు వీస్తున్నందున పొడి వాతావరణం కొనసాగుతుందన్నారు.

Read More »

దేశంలో మరో వైరస్‌ కలకలం..

కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే.. కొత్త కరోనా వెలుగులోకి వచ్చి దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా 4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి వచ్చి దేశాన్ని మరింత ఆందోళనలోకి నెడుతోంది. వివరాల్లోకెళితే.. మొదట రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ బర్డ్‌ఫ్లూ వైరస్‌ క్రమంగా ఇతర రాష్ట్రాలల్లోకి చొరబడుతోంది. ఇప్పుడు కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Read More »

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జోరుమల్య బాగ్చి ప్రమాణస్వీకారం

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జోరుమల్య బాగ్చి సోమవారం ఉదయం 10 గంటల 15 నిముషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సిజె జెకె.మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ బాగ్చి ఇంతకుముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై ఎపి కి వచ్చారు. ఎపి హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్‌ బాగ్చి రెండో స్థానంలో కొనసాగనున్నారు. జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఈ నెల 6 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ...

Read More »