బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో తేనె, నిమ్మరసం తీసుకుంటున్నారా..

డైజెస్టివ్ సిస్టం ని హెల్దీ గా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. తీసుకునే ఆహారం, వ్యాయామం, స్లీప్ సైకిల్, ఓవరాల్ హెల్త్… వీటన్నింటిపై అరుగుదల ఆధారపడి ఉంటుంది. మనం చాలా సార్లు రకరకాల ఫ్యాన్సీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, అరుగుదల బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టం చక్కగా పని చేస్తుంది అనుకుంటూ. కానీ, కొన్ని సింపుల్ ఫుడ్స్ ని మన డైట్ లో భాగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది.

1. తేనె – నిమ్మరసం

గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలిపి తాగితే బ్లోటింగ్ బాగా తగ్గుతుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. టాక్సిన్స్ ఫ్లష్ ఔట్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. స్కిన్ హెల్త్ కి తోడ్పడుతుంది. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగే వాటర్ రిటెన్షన్ కి మంచి మందు. ఎలెక్ట్రొలైట్స్ బాలెన్స్ కి సాయపడుతుంది. కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది. గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. లివర్ ని క్లెన్స్ చేస్తుంది.

2. యాపిల్..

యాపిల్స్ రుచిగా ఉంటాయి, న్యూట్రిషస్ గా ఉంటాయి. యాపిల్స్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్లడ్ సుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీ ని బూస్ట్ చేస్తుంది. యాపిల్స్ బోన్స్, టీత్, స్కిన్ కి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వలన కడుపు నిండు గా ఉండి బింజ్-ఈటింగ్ జోలికి వెళ్లకుండా ఉంటాం. యాపిల్ లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ వలన అరుగుదల స్మూత్ గా ఉంటుంది. యాపిల్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయడం లో ముందుంటాయి. యాపిల్ అన్ హెల్దీ కొలెస్ట్రాల్ ని తగ్గించడం లో సహాయపడుతుంది. యాపిల్స్ బ్రెయిన్ ఫంక్షన్ లో హెల్ప్ చేసి జ్ఞాపక శక్తి ని పెంచుతాయి. బ్రెయిన్ లోని నెర్వ్ సెల్స్ ఒక దానితో ఒకటి చేసుకునే కమ్యూనికేషన్ కి సాయపడి అల్జైమర్స్ రాకుండా కాపాడుతాయి.

3. అరటి పండు..

ఇమిడియెట్ గా ఎనర్జీ ని ఇచ్చే పండు ఏదంటే అది అరటి పండే. అరటి పండు లో సాల్యుబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్స్ రెండూ ఉంటాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్ట్ కి మేలు చేస్తాయి. ఈ పండు గుండె కి చాలా మంచిది. కార్డియో వాస్క్యులర్ డిసీజ్, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటివి రాకుండా కాపాడుతుంది. అరుగుదలకి సహకరించి మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. రోజంతటికీ కావాల్సిన ఫిజికల్, మెంటల్ స్టామినా ను అందిస్తుంది. ఈ పండు హైబీపీ ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అరటి పండు లో ఉండే ఐరన్ వల్ల ఎనిమియా దరి చేరదు.