1996లో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా బుధవారం రోజున మేకర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
పాటలో చూపించిన కొన్ని విజువల్స్ చూస్తుంటే ‘భారతీయుడు 2’ అంచనాలను మించేలా శంకర్ తెరకెక్కించారని స్పష్టమవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను రితేష్ జి.రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.