భీష్మ రివ్యూ

భీష్మ రివ్యూ

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ మరియు రష్మికా మందన్నాలు హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “భీష్మ”. నితిన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రంగా మారిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం నితిన్ కు హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే వ్యవసాయ రంగానికి చెందిన “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ద్వారా మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ అనంత్ నాగ్ సరికొత్త పద్దతులను ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.అయితే వీరికి పోటీగా క్రిమినల్ మైండెడ్ మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) అడ్డుపడుతుంటాడు.ఇదే నేపథ్యంలో లైఫ్ ను బోరింగ్ గా సింగిల్ గా గడుపుతున్న భీష్మ(నితిన్) రష్మికాతో లవ్ లో పడతాడు.అయితే కొన్ని ఊహించని పరిణామాల ద్వారా నితిన్ భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు చేపడతాడు.అలా చేపట్టాక నితిన్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?జిష్షును ఎలా ఆపగలిగాడు?తాను అలా మారడానికి గల కారణం ఏమిటి అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది దానికి తోడు త్రివిక్రమ్ తో తీసిన “అఆ” తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కూడా నితిన్ కొట్టలేదు.దీనితో ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు.అయితే ఈ చిత్రం నుంచి చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా అవి మంచి వైరల్ అయ్యేవి. అలా పాటలతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగినట్టు అనిపిస్తుంది.మరీ గొప్పగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ప్రతీ ఆర్టిస్టు మంచి నటనతో అలాగే ఆలోచింపజేసే కథనంతో మెల్లగా కొనసాగుతుంది.

అలాగే నితిన్ లోని ఓ సరికొత్త యాంగిల్ ను వెంకీ ప్రెజెంట్ చెయ్యగా దానికి నితిన్ పూర్తి న్యాయం చేకూర్చారు.అయితే ట్రైలర్ తోనే కథ తాలూకా థీమ్ ఏమిటి అన్నది రివీల్ చేసేసిన దర్శకుడు సినిమా చూస్తున్నంతసేపు దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగున్ను అనిపిస్తుంది.ఇలా ఫస్టాఫ్ అంతా ఒకే అనిపించే నరేషన్ తో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ మరియు ఇంటర్వెల్ లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారని చెప్పాలి.ముఖ్యంగా కామెడీ సీన్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి.ఇలా కామెడీ మాత్రం సెకండాఫ్ లో మంచి ఎస్సెట్ గా నిలుస్తుంది.”ఛలో” చిత్రంతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని చెప్పాలి.అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్,అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు బాగున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే నితిన్ కోసం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.తనదైన కామెడీ టైమింగ్,ఎమోషన్స్ రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్ లోను అదరగొట్టేసాడు.అలాగే రష్మిక మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది.ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి.అలాగే మరో కీలక నటుడు జిష్షు గుప్త మరోసారి టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ అవుతాడని చెప్పాలి.