భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి.. సీక్వెల్‌గా భారతీయుడు-2 సినిమా వస్తోంది. ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కానీ అంతకన్న ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్‌ను కంగారుపెడుతున్నాయి. కారణం.. సినిమాను నిలిపివేయాలని రాజేంద్రన్ కోర్టుకెళ్లడమే. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారాయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన నిజయాన్ని అందుకుంది. ఇందులో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ నటన, హావభావాలు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు-2లోనూ కమల్ అంతకుమించి అనేలా రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. సీక్వెల్ ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా వివాదాలు చుట్టుముట్టాయి.