తెలంగాణ క్యాబినెట్ కు ఈసీ బ్రేక్…జరుపకూడదంటూ !

revanth-on-e-cv.jpg

రేవంత్‌ కేబినేట్‌ కు ఎన్నికల సంఘం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. నేడు సెక్రటేరియట్ లో జరుగనున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ రోజు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముందే నిర్ణయించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అయితే.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. కాసేపట్లో సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, అధికారులతో కీలక అంశాలపై సమీక్ష సమావేశం ఉండనుంది. ఇలాంటి తరుణంలోనే… రేవంత్‌ కేబినేట్‌ కు ఎన్నికల సంఘం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మరి ఇవాళ్టి సమావేశం ఉంటుందా ? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Share this post

scroll to top