చెప్పిన స్టోరీలేంటి చేస్తున్న పనులేంటి..

mani-kanta-19.jpg

నాగ మణికంఠ సోనియాకి ముద్దు పెట్టాడు. ఆమె సోఫాలో కూర్చుని పాట పాడిన తర్వాత ఆమెకు ముద్దు పెట్టాడు. అక్క అక్క అని పిలుస్తాడు ఆ అభిమానంతో అలా చేశాడు అనుకుందాం. ఆ తర్వాత నైనికా కూర్చుని ఉంటే ఆమెను పలకరించి నీ వస్తువుల మీద ఈగ కూడా వాలనివ్వను అంటూ హగ్ చేసుకుని తల మీద ముద్దు పెట్టుకుని వెళ్లాడు. ప్రేరణ కుర్చీలో కూర్చుని ఉంటే నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడతావ్ అంటూ హగ్ చేసుకుంటాడు. ఇంక యష్మీ విషయం అయితే వేరే లెవల్. ఆమెను నామినేట్ చేసినందుకు హర్ట్ అయ్యిందని కూల్ చేయడానికి వెళ్లాడు. ఆమెను హగ్ చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె అక్కడ అన్ కంఫర్ట్ గా ఫీలవుతూ వచ్చింది. ఆ విషయాన్ని నేరుగానే చెప్పింది. చేయి తీ అని కూడా అంది. కానీ, మణికంఠ రెండోసారి కూడా హగ్ చేసుకున్నాడు.

ఈ సీన్స్ చూసిన తర్వాత నాగ మణికంఠ ఆట తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఫ్రెండ్ షిప్ అనే ముసుగులో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆడియన్స్ హితవు పలుకుతున్నారు. ఇతని ప్రవర్తన ఇలాగే ఉంటే హౌస్ లో కొనసాగడం దాదాపుగా అసాధ్యం అని చెప్పాల్సింది. నాగ మణికంఠ అస్సలు మనుషులు, రిలేషన్స్ అంటే పడవు అని చెప్పి ఇప్పుడు ఇలా అందరికీ హగ్గులు ఇస్తూ పోతుంటే.. అతను రియలా? ఫేకా అనే అనుమానం వస్తోంది. మరోవైపు యష్మీ అయితే తనకు నచ్చడం లేదు అని చెప్పేస్తోంది.

Share this post

scroll to top