కంట్రోల్ తప్పేసిన నిఖిల్..

bigg-boss-30.jpg

కోపం అన్నది ఎంతటి తెలివైనవాడినైనా ఉన్మాదిలా తయారు చేస్తుంది. ఆవేశం అన్నది ఎంత నెమ్మదస్తుడినైనా సైకోలా మార్చేస్తుంది. బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చూశాక ఆడియన్స్‌కి ఖచ్చితంగా ఈ మాట గుర్తుకురాక తప్పదు. ఎందుకంటే అలా అరాచకంగా ఆడాడు నిఖిల్. గత వారం అబ్బాయిలు అబ్బాయిలు తన్నుకున్నారు నెట్టుకున్నారు. ఆవేశంగా ఆడారు అది చూడటానికి ఎవరికీ అంత ఇబ్బందిగా అనిపించదు. కానీ ఈరోజు ఎపిసోడ్‌లో అమ్మాయిలపై మరీ దారుణంగా బిహేవ్ చేశాడు నిఖిల్. అసలు నిఖిల్ ఇలా బిహేవ్ చేస్తాడని ఆడియన్స్ కూడా అనుకొని ఉండరు. ఒక ఉన్మాదిలా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడు నిఖిల్. ప్రేరణ-యష్మీలను బలవంతంగా లాగేసి పక్కకి నెట్టేయడం వద్దు వద్దు అన్నా వినకుండా పట్టుకోవడం ఇలా నిఖిల్ చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని సంచాలక్ చెప్పినా చుట్టూ ఉన్నవాళ్లు వారించినా కూడా నిఖిల్ వినలేదు. అసలు ఈ ఒక్క ఎపిసోడ్‌పైనే నాగార్జున వీకెండ్‌లో గంట క్లాసు పీకొచ్చు ఆ రేంజ్‌లో వయలెన్స్ జరిగింది.

Share this post

scroll to top