గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ నేత బీఎల్ సంతోష్‌పై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని… కవితను మద్యం కేసు నుంచి తప్పించేందుకే ఆయనపై కేసులు పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే అని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్యాఫ్తునకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.