బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా పాణతాల సురేష్

కడప జిల్లాలోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పనతల సురేశ్‌ పేరును పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పనతల సురేశ్‌ ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అకాల మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యం కాగా, చనిపోయిన ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఇప్పటికే జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధం అయింది. బద్వేల్‌ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ ఉంటుంది.