కేంద్ర మంత్రులకు స్వాగతం ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ బీజేపీ

telanga-18.jpg

బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్‌ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి కేబినెట్‌ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌ 19న నగరానికి చేరుకుని కరీంనగర్‌కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్‌టాప్‌ జీప్‌లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. 

Share this post

scroll to top