బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదవశాత్తూ తుపాకీ బుల్లెట్ తగిలి కాలికి తీవ్రగాయమైంది. మంగళవారం ఉదయం గోవిందా తన ఇంటి నుంచి కోల్‌కతాకు బయలుదేరుతున్న క్రమంలో … లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళుతుండగా అది చేతి నుంచి జారి కిందపడటంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించి కాలిలో నుండి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనేజర్ వెల్లడించారు.
- Home
- Entertainment
- Movies
- బాలీవుడ్ నటుడు గోవిందా కాలికి బుల్లెట్ గాయం..