రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. విచారణకు నటి హేమ డుమ్మా

hema-a.jpg

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు వారందరిని విచారిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని క్రైం బ్రాంచ్ పోలీసులకు లేఖ రాసింది. ప్రస్తుతం తాను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అందులో పేర్కొ్ంది. కానీ, హేమ రాసిన లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Share this post

scroll to top