లైటింగ్ ఇలా ఉంటే ఇల్లు మెరిసిపోతుంది..

లైటింగ్ ఇలా ఉంటే మీ ఇల్లు మెరిసిపోతుంది

అందమైన అలంకరణ వస్తువులున్నా ఇంటికి లైటింగ్ మరింత అందం ఇస్తుంది అంటారు. లైటింగ్ ఎంత బావుంటే వస్తువులు అంత అందంగా కనిపిస్తాయి . లివింగ్ రూమ్ లో లైటింగ్ ఎక్కువ అవసరం ఉండదు . చదువుకొనేది ,టివి చూసేది ఇక్కడ . గదిమూలల్లో గోడల పైన పెయింటింగ్స్ ,ఫోటోల పైన,సోఫాలు ,కూర్చునే ప్రాంతంలో చక్కగా వెలుతురు పడాలి, అలాగే బెడ్ రూమ్ లైట్స్ మూడ్ మార్చేవిగా ఉండాలి. గదిలోకి వెళ్ళగానే వేసే లైట్ తో పడకగది లోని సామాగ్రి మొత్తం కనిపించేలా ఉండాలి . ఎక్కువ కాంతినిచ్చే లైట్లు వాడకూడదు. అందమైన రంగు దీపాలు ముఖ్యంగా ఎరుపు ,ఆకుపచ్చ ,నారింజ రంగుల షేడ్స్ బావుంటాయి . వంటగది లో మెరుగైన కాంతి కావాలి. వంటచేసి భాగం పైన లైటింగ్ పడాలి.

టాస్క్ లైటింగ్ ప్రతి ఇంటిలో ఒక భాగం. చిమ్నీపై వెలుతురు, పుస్తక పఠనం దీపం లేదా పెయింటింగ్ కింద లేదా క్యాబినెట్ లోపల హైలైట్ చేసిన దీపం అయినా, ఇంటి లోపలి భాగాన్ని పెంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతేకాక, ఇది ఉత్పాదకతను పెంచుతుంది.