ఫిరాయింపు MLAలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు BRS కంప్లైంట్..

cong-brs-26.jpg

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తొలుత స్పీకర్‌కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేయగా.. స్పందించకపోవడంతో పోస్ట్, మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోచారం, సంజయ్, దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు లేఖలో కోరింది.

Share this post

scroll to top