కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు..

ktr-09-1.jpg

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు ఆ హామీలనే మర్చిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటినీ విస్మరించారన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణ మాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

Share this post

scroll to top