కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆయన మంగళవారం ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు. మా పార్టీలో చేరిన వారిలో 10 మంది ఓడిపోయారు. ఫిరాయింపులతో మాకు లాభం జరగలేదు. మేమేం లాభపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎప్పుడూ చెప్పలేదు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు.