వరదల నుంచి కోలుకుంటున్న సమయంలో గురువారం తెల్లవారు జామును 1 గంట నుంచి 3 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరు వాగుకు మరోసారి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పలు కాలనీలు క్రమంగా వదలో చిక్కుకుంటున్నాయి. గంట గంటకు బుడమేరు వాగుకు వరద పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికార యంత్రం శ్రమిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం ఏర్పడుంది. ఈ క్రమంలో మరోసారి వరద పెరుగుతుండటంతో పలు కాలనీలల్లోని ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్తున్నారు.
- Home
- News
- Andhra Pradesh
- బుడమేరు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి..