అక్కడ చికెన్ వంటకాలు తిన్నోళ్లకు తిన్నంత!

food-sa.jpg

కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారికి నాన్‌ వెజ్‌ వంటకాలు ఎక్కడ కనిపించినా లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. చికెన్‌ కబాబ్, చికెన్‌ మంజూరియా, చికెన్‌ 65, చికెన్‌ బిర్యానీ, చిల్లీ చికెన్‌.. ఇలా కోడి రకాన్ని చూసుకుని మరీ వెరైటీలు వండి వార్చే.. ఇక ఆరోగ్యంపై కాస్త అవగాహన ఉన్నవారికోసం తక్కువ స్పైసీగా ఉండే రుచికరమైన చికెన్ వంటకాలు అందించే హోటళ్లు కూడా ఉన్నాయి.

అయితే అన్ని రకాల చికెన్‌ స్పెషల్స్‌ ఒకే చోట దొరికితే.. ఇంకేం పండగే. అలాంటి వారి కోసం అగర్తలాలో జరిగే చికెన్ ఫుడ్ ఫెస్టివల్ స్పెషల్ ఆహ్వానం పలుకుతోంది. అగర్తల క్లబ్ ద్వారా నిర్వహించే ఈ ఫెస్టివల్‌ను గతేడాది తొలిసారిగా నిర్వహించగా..ఈ ఏడాది రెండో సారి ఆ రుచులను అందించడానికి సిద్దమైంది. త్రిపుర రాజధాని అగర్త వేధికగా 10 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను ఒలింపియాడ్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి నిర్వహిస్తున్నారు.

Share this post

scroll to top