సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
