Cinema

సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను బిహార్‌ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో డీఐజీ గగన్‌దీప్‌ గంభీర్, జాయింట్‌ డైరెక్టర్‌ మనోజ్‌ శశిధర్‌ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్‌దీప్, జేడీ మనోజ్‌ గుజరాత్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు. సుశాంత్‌ స్వరాష్ట్రమైన బిహార్‌లో ఇప్పటికే పోలీసులు సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ...

Read More »

టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) కన్నుమూశారు. ఈ రోజు (శుక్ర‌వారం) తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ‌ జేస్తున్నారు.

Read More »

కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్‌ ప్రీత్‌?

తెలుగులో బయోపిక్‌ల టైమ్‌ నడుస్తోంది. ఇటీవల సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ అనూహ్య విజయాన్ని సాధించడంతో చాలా మంది మరిన్ని జీవిఒత కథల్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా 2000లో ఒలింపిక్‌ మొడల్‌ని మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు అందించి చరిత్ర సష్టించింది కరణం మల్లేశ్వరి. ఆమె జీవిత కథ ఆధారంగా త్వరలో ఓ సినిమా రాబోతోంది. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కరణం మళ్లేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని కోన ...

Read More »

కరోనా నుండి కోలుకున్న అమితాబ్‌, ఇంకా ఆసుపత్రిలోనే అభిషేక్‌

బిగ్‌ బి కరోనాను జయించారు. జులై 11వ తేదీన కరోనా పాజిటివ్‌ అని తేలడంతో మంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌ 21 రోజుల వైద్యం తర్వాత కోలుకున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్‌ అని తేలడంతో 77 ఏళ్ల అమితాబ్‌ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా అమితాబ్‌తోపాటే కరోనా పాజిటివ్‌ కారణంగా నానావతి ఆసుపత్రిలో చేరిన ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఆయనకు చేసిన పరీక్షలో మళ్లీ పాజిటివ్‌ అని ...

Read More »

‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో…

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో పట్టాలెక్కనుంది. కరోనా నేపథ్యంలో ఈ రియాల్టీ షో పట్ల వున్న అనుమానాలు తొలగిస్తూ… స్టార్ మా ‘బిగ్‌బాస్ 4’కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను తనదైన శైలిలో ఆకట్టుకున్న నాగార్జున .. ఈసారి ‘బిగ్‌బాస్ సీజన్ 4’ను కూడా హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఆయనపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. ఈ ...

Read More »

మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు చెప్తే నమ్మరు కాని… ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు ...

Read More »

సుశాంత్ మృతిపై స్వామి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్‌ చేసిన డాక్యుమెంట్‌ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో ...

Read More »

మరో యువ నటుడు ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఇప్పటికీ బాలీవుడ్‌ను వెంటాడుతుండగా మరో యువనటుడు, ‘ఖుల్తా ఖలీ ఖులేనా’ ఫేమ్ మయూరి దేశ్ ముఖ్ భర్త నాందేడ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు . ప్రముఖ మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్ పట్టణంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మయూరి దేశ్ ముఖ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో, మరాఠీ ...

Read More »

రామ్‌గోపాల్‌ వర్మకు మరోసారి జరిమానా విధించిన జిహెచ్‌ఎంసి

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) అధికారులు వరుసగా రెండోసారి జరిమానా విధించారు. ఇటీవల ఆయన చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఈ నెల 22న రూ.4 వేలు జరిమానా విధించింది. అయితే ఇదే పాంతంలో సుమారు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో జిహెచ్‌ఎంసి సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ రూ.88 వేలు చెల్లించాలని ఈ-చలానా జారీ చేసింది. కాగా, లాక్‌డౌన్‌ అనంతరం మొదటి ...

Read More »

రియా చక్రవర్తిపై కేసు నమోదు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజీవ్ నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కృష్ణ కుమార్‌సింగ్‌ ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాలను రియా స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ మేరకు రియాను బుధవారం విచారించనున్నట్లు పోలీసులు ...

Read More »