news

వార్ 2 లో ఎన్టీఆర్‌కి జోడిగా ఆ హీరోయిన్ నటిస్తుందా….

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ న‌టిస్తుంది. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న దేవ‌రలో జాన్వీ జాక్ పాట్ అందుకుంది. ఇంత‌లోనే ఆర్.ఆర్.ఆర్ స‌హ‌న‌టి ఆలియా భ‌ట్ ఇప్పుడు ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించ‌నుందని క‌థ‌నాలొస్తున్నాయి. ఎన్టీఆర్ ,హృతిక్ తో క‌లిసి వార్ 2లో న‌టిస్తున్నార‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి దీనిపై ఊహాగానాలున్నాయి. వార్ 2లో ఆలియా ఒక‌ హీరోయిన్ గా న‌టిస్తుంది. కానీ హృతిక్ స‌ర‌స‌నా? లేక ఎన్టీఆర్ తో న‌టిస్తుందా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. అయితే ఆలియా ...

Read More »

కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న హీరో….

సెలబ్రిటీలు ఏంచేసినా అది వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు టైర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారన్నదే ఆ వార్త. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారట. కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’మార్కు వేయించినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటారు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇప్పుడీ కారు, ఆ ...

Read More »

యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న సంయుక్త మీనన్‌ …ఆ సినిమా కోసమే…

నా తదుపరి సినిమా స్వయంభు కోసం, నేను గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నా. నిజంగా ఇది మాకు అద్భుతమైన ప్రయాణం. మేమందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేసింది సంయుక్త మీనన్‌. ఆమె నిఖిల్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చారిత్రాత్మక చిత్రం స్వయంభులో హీరోయిన్ గా నటిస్తుంది. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్‌, శ్రీకర్‌ నిర్మించనున్నారు… హీరో నిఖిల్‌ 20వ సినిమాగా రూపొందుతున్నది. ఇందులో నిఖిల్‌ యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే పలు యుద్ధవిద్యల్లో ప్రావీణ్యం పొందే పనిలో నిఖిల్‌ బిజీగా ఉన్నాడని చిత్రబృందం తెలిపింది. ...

Read More »

మరో సారి క్రేజీ కాంబోలో విజ‌య్ దేవ‌ర‌కొండ…..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ తీసుకోకుండానే సినిమాలు క‌మిట్ అవుతున్నాడు. ఒక‌టి పూర్తి చేయ‌డం మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌డం. ఇదే కొంత కాలంగా రౌడీబోయ్ యాక్టివిటీ. ప్ర‌స్తుతం ప‌ర‌శురాంతో చేస్తోన్న ఫ్యామిలీ స్టార్ ముగింపు దశ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడైనా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా కాకుండానే విజ‌య్ సైన్ చేసిన మ‌రో ప్రాజెక్ట్ కూడా ఉంది. ర‌వి ...

Read More »

చరిత్ర పురుషుడిగా రామ్‌చరణ్‌… తెరకెక్కనుంన్నాడా…

రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్‌ పూర్తిచేసే పనిలోఉన్నారు. ఈ ఏడాది దసరాను టార్గెట్‌గా చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. ఈ చిత్రం తర్వాత ఉప్పెనఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించనున్నడు. ఆర్‌సీ16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇదిలావుంటే.. అప్పుడు ఆర్‌సీ17కు సంబంధించిన న్యూస్‌ కూడా మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. సంజయ్‌లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారట. నిజానికి అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేసేందుకు సంజయ్‌ గతంలో ప్రయత్నించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్‌తో ఆయన ...

Read More »

అయన జీవిత చరిత్ర రాయడం అంటే తపస్సుగా భావిస్తున్నానన్న యండమూరి ……

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, చిరంజీవి జీవిత చరిత్ర రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే మీడియా సాక్షిగా ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో ఈ విషయం గురించి యండమూరి ప్రస్తావించగా… చిరంజీవితో నా బంధం ఈనాటిది కాదు…. 42ఏళ్ల నాటిది. ఆయన మంచుపల్లకి నుంచి ఇప్పటివరకూ మా స్నేహం కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘమైన ప్రయాణాల్లో కుదుపులు సహజం. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు కూడా అలాంటివే. అయితే ప్రస్తుతమైతే మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవాని తెలిపారు . ఇంకా మాట్లాడుతూ ‘నాలుగేళ్ల ...

Read More »

యాత్ర 2’ సక్సెస్ మీట్‌లో దర్శకుడు మహి వీ రాఘవ్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన యాత్రకు సిక్వల్ గా రూపొందిన సినిమా యాత్ర 2. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా, వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ మెహాన్ రెడ్డి పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌లైన ఈ మూవి ఘన విజయాన్ని ...

Read More »

చిరంజీవి ఇంట శివ రాజ్‌కుమార్‌ సందడి…

కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌,చిరంజీవి ఇంట సందడి చేశారు. కేంద్రం చిరుకి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి .. పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘‘డియర్‌ శివ రాజ్‌కుమార్‌.. నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుంచి రావడం హృదయాన్ని హత్తుకుందని పేర్కొన్నారు. ఆయనతో కలిసి భోజనం చేయడం, లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం ఆనందంగా ...

Read More »

యాత్ర2 సినిమాపై వైఎస్ విజయమ్మ ప్రశంశలు…

యాత్ర2 లో వైఎస్ రాజశేఖర్ ‌రెడ్డిని కళ్లకు కట్టినట్టు మరోసారి ప్రజలకు చూపించారన్నారు వైఎస్ విజయమ్మ. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో యాత్ర సినిమాను వీక్షించిన విజయమ్మ… రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ మహిరెడ్డికి, చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని.. మరోసారి ప్రజల కళ్లకు కట్టినట్టు చూపారని ప్రశంసించారు. ఆనాడు, రాజశేఖర్‌రెడ్డిని ఆదరించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన పిల్లలను కూడా అక్కున చేర్చుకుంటున్నారని ...

Read More »

చరణ్ జోడీగా జాన్వీ కపూర్

చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో .. పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆ తర్వాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని పాత్రలకి సంబంధించి, విజయనగరం .. విశాఖపట్నం .. శ్రీకాకుళం .. సాలూరు ప్రాంతాల్లో ఆడిషన్స్ ...

Read More »